Header Banner

శ్రీశైలం బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి! హంసవాహనంపై స్వామి, అమ్మవార్ల విహారం!

  Fri Feb 21, 2025 11:04        Devotional

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు స్వామి అమ్మవార్లు హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానం తరుపున అధికారులు శ్రీశైలం శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం (Srisailam) మహాక్షేత్రంలో మహాశివరాత్రి (Mahashivaratri ) బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మూడోరోజు శుక్రవారం స్వామి అమ్మవార్లు హంసవాహనం (Hamsa Vahanam)పై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానం తరుపున అధికారులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సాయంకాలం శ్రీస్వామి అమ్మవారు హంసవాహనంపై ఆశీనులై పూజలందుకొనున్నారు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారికి కన్నులపండువగా గ్రామోత్సవం నిర్వహిస్తారు.

కాగా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండో రోజు గురువారం భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను భృంగివాహనంపై ఆశీనులనుజేసి క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం చేపట్టారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం తరపున అధికారులు, అర్చకులు పట్టువస్త్రాలను సమర్పించారు.

అర్ధనారీశ్వర రూపానికి మూలకారకుడైన భృంగి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల సేవలో తరించారు. భృంగి వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులనుజేసి సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లను క్షేత్ర పురవీధుల్లో విహరింపజేశారు. అశేష భక్తజనం ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించి పరవశించారు. గ్రామోత్సవం ముంగిట కోలాటం, చెక్కభజన, గొరవయ్యల, బుట్టబొమ్మల నృత్యాలు, బీరప్పడోలు, బంజార నృత్యం, తప్పెట్లు, శంఖునాదాలు, మంగళవాయిద్యాలతో కొనసాగింది. ఆలయ రాజగోపురం నుంచి గంగాధర మంటపం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కొనసాగింది. వేలాదిగా తరలివస్తున్న భక్తులతో శ్రీగిరి కిక్కిరిసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నిత్యాకళారాధన వేదిక, పుష్కరిణి ప్రాంగణంలోని భ్రామరీకళావేదిక, శివదీక్షాశిబిరాల ప్రాంగణంలో గురువారం సాయంత్రం సంప్రదాయ నృత్యప్రదర్శన, జానపద నాటకాలను ప్రదర్శించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #srisailam #srisailambramohstavam #devotional #temple #srisailamtemple